ముంబైలో బస్సు బీభత్సం.. ఆరుగురి మృతి.. వీడియో ఇదిగో!
- 49 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
- కుర్లాలో అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
- అపార్ట్ మెంట్ గేట్లను ఢీ కొట్టి సెల్లార్ లోకి వెళ్లి ఆగిన వైనం
ముంబైలోని కుర్లాలో సోమవారం రాత్రి ఓ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలను, పాదచారులను ఢీ కొట్టింది. దీంతో ఆరుగురు చనిపోగా మరో 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిలవడంతోనే ఈ ఘోరం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కుర్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. బెస్ట్ (బృహన్ ముంబై ఎలెక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్)కు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరి వెళుతుండగా అదుపు తప్పింది.
వేగంగా దూసుకెళుతూ ముందు వెళుతున్న ఓ రిక్షాను, మూడు కార్లను, బైకర్లను పాదచారులను ఢీ కొట్టింది. ఆపై ఓ అపార్ట్ మెంట్ గేట్లను ఢీ కొట్టి సెల్లార్ లోకి వెళ్లి ఆగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలలో బస్సు వేగంగా దూసుకెళుతూ వాహనాలను ఢీ కొట్టడం కనిపిస్తోంది.