బ్రిటన్ లో ఆంధ్రా టెక్కీ దుర్మరణం

  • లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి చిరంజీవి
  • మిత్రులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం
  • డివైడర్‌ను ఢీకొనడంతో కారు బోల్తా
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్ లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన పి. చిరంజీవి (32) లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 

ఆయన తన కారులో మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. 


More Telugu News