ఆర్బీఐకి రష్యా భాషలో బాంబు బెదిరింపు.. నెలలో రెండోసారి
- ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు రష్యన్ భాషలో ఈమెయిల్
- బాంబులతో ఆర్బీఐ భవనాన్ని పేల్చివేయబోతున్నట్టు బెదిరింపు
- గత నెల 16న కూడా బాంబు బెదిరింపు అందుకున్న ఆర్బీఐ
దేశంలో బాంబు బెదిరింపు ఘటనలు కొనసాగుతున్నాయి. గత నెలలో విమానయాన సంస్థలకు వందలాది బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లు, ఇతర సంస్థలకు అయితే లెక్కేలేదు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది. ఆ తర్వాత సద్దుమణిగిన ఈ వ్యవహారం మళ్లీ మొదలైంది.
తాజాగా, భారతీయ రిజర్వు బ్యాంకుకు రష్యన్ భాషలో బాంబు బెదిరింపు వచ్చింది. ముంబైలోని ఆర్బీఐ భవనాన్ని బాంబులతో పేల్చి వేయబోతున్నట్టు చెబుతూ నిన్న మధ్యాహ్నం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు రష్యన్ భాషలో ఈమెయిల్ వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్బీఐకి నెల రోజుల్లో ఇది రెండో బాంబు బెదిరింపు. గత నెల 16న ఆర్బీఐ కస్టమర్ కేర్‌కు ఇలాంటి బెదిరింపే వచ్చింది. తాను లష్కరే తాయిబా సీఈవోనని చెబుతూ కాలర్ ఈ బెదిరింపునకు పాల్పడ్డాడు. తాజా బెదిరింపు నేపథ్యంలో ఆర్బీఐ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.