అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి స్పందన

  • చట్టం ముందు అందరూ సమానమేనన్న రేవంత్
  • చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య
  • ఇందులో తన జోక్యం ఉండదన్న సీఎం
సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని అన్నారు. 

మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్దకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.


More Telugu News