అల్లు అర్జున్ అరెస్ట్ పై జగన్ స్పందన

  • తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడంపై జగన్ ఆవేదన
  • దీనికి అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న
  • అరెస్ట్ ను ఖండిస్తున్నానని ట్వీట్
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ... హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేశారని... ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని తన ట్వీట్ లో వివరించారు. 

అయితే ఈ ఘటనకు నేరుగా ఆయనను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మరోవైపు, బన్నీ అరెస్ట్ ను అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు కూడా ఖండించారు.


More Telugu News