అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదు: డీసీపీ

  • సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
  • అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని కథనాలు
  • అల్లు అర్జున్ కు తగినంత సమయం ఇచ్చామన్న పోలీసులు
  • ఆయన బయటికి వచ్చాకే అదుపులోకి తీసుకున్నామన్న డీసీపీ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదంటూ విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కు దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారంటూ కథనాలు వచ్చాయి. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ స్పందించారు. 

హీరో అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. డ్రెస్ మార్చుకుంటానంటే అల్లు అర్జున్ తగినంత సమయం ఇచ్చామని వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా సమయం ఇచ్చామని తెలిపారు. 

అల్లు అర్జున్ బయటికి వచ్చాకే అరెస్ట్ చేశామని డీసీపీ వివరించారు. అల్లు అర్జున్ స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నారని వెల్లడించారు. 


More Telugu News