అల్లు అర్జున్ అరెస్ట్ పై పూనమ్ సెటైర్

  • రాజకీయానికి, నాయకత్వానికి తేడా చెప్పిన నటి
  • అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయమని వ్యాఖ్య
  • బన్నీకి మద్దతుగా ట్వీట్ చేసిన పూనమ్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి హీరో అల్లు అర్జున్ ని బాధ్యుడిగా చేయడం, అరెస్ట్ చేసి జైలుకు పంపడంపై టాలీవుడ్ ప్రముఖులు శుక్రవారం నుంచి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు మద్దతుగా బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు రాష్ట్ర, కేంద్ర నాయకులు ట్వీట్లు చేశారు. జైలు నుంచి విడుదలైన బన్నీని పరామర్శించేందుకు శనివారం ఉదయం ఆయన నివాసానికి ప్రముఖులు క్యూ కట్టారు. హీరోలు, దర్శకులు సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు ఫ్యామిలీని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే నటి పూనమ్ కౌర్ తాజాగా సంచలన ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయం ఉందని, అధికార దుర్వినియోగం జరిగిందనే అర్థంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతకు ముందు శుక్రవారం అల్లు అర్జున్ తో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ తన ఫేవరెట్ హీరో అంటూ పూనమ్ పోస్ట్ పెట్టింది. అయితే, ఈ వ్యాఖ్యలు అసందర్భమని, అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వ్యాఖ్యానించాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో శనివారం పూనమ్ మరో ట్వీట్ చేస్తూ.. ‘అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం, అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించడమే నాయకత్వం’ అంటూ రెండింటి మధ్య తేడా చెప్పారు. జస్ట్ థాట్స్ అంటూ పూనమ్ ఈ ట్వీట్ కు క్యాప్షన్ జోడించారు.


More Telugu News