అల్లు అర్జున్, రానా స్నేహానుబంధం గురించి చెప్పడానికి ఈ వీడియో చాలు!
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు తాత్కాలిక బెయిల్
- ఈ రోజు చంచల్ గూడ జైలు నుంచి విడుదల
- అల్లు అర్జున్ నివాసంలో భావోద్వేగాల వెల్లువ
- బాల్య స్నేహితుడ్ని పరామర్శించిన రానా
సంధ్య థియేటర్ ఘటన కేసులో మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ నేడు విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ నివాసంలో ఓవైపు భావోద్వేగాలు, మరోవైపు ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సినీ ప్రముఖులు అల్లు వారింటికి వచ్చి బన్నీని పరామర్శిస్తున్నారు.
కాగా, అల్లు అర్జున్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటి కూడా మిత్రుడ్ని పరామర్శించడానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా రానా వచ్చిన సమయంలో అల్లు అర్జున్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. బన్నీ ఫోన్ లో మాట్లాడుతుండడం చూసిన రానా... షేక్ హ్యాండ్ ఇచ్చి అవతలికి వెళుతుండగా... బన్నీ ఫోన్ మాట్లాడుతూనే రానాను ఆగమంటూ చేయి పట్టుకున్నాడు.
అనంతరం కాల్ ముగిశాక... మిత్రుడ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బన్నీ, రానా ఫ్రెండ్షిప్ ను కొనియాడుతూ నెటిజన్ కామెంట్లు పెడుతున్నారు.