పుష్ప-3లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడా...?
- పుష్ప -2 కొనసాగింపుగా తెరకెక్కనున్న పుష్ప -3 ది ర్యాంపేజ్
- పుష్ప- 2 క్లైమాక్స్‌లో బాంబు దాడి చేసింది విజయ్ దేవరకొండ అని ప్రచారం
- దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తుంటారన్న నటి రష్మిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన్న కలిసి జంటగా నటించిన పుష్ప -2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కలెక్షన్లలో పుష్ప -2 సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా అడుగుపెట్టి రికార్డు సృష్టించింది.
కాగా, పుష్ప ది రైజ్, పుష్ప -2 ది రూల్‌కు కొనసాగింపుగా పుష్ప -3 ది ర్యాంపేజ్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పార్ట్ -2 క్లైమాక్స్‌లో ఆ విషయాన్ని తెలియజేస్తూ పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఒక వ్యక్తిపై బాంబు దాడికి పాల్పడినట్లు చూపించారు. అయితే ఆ వ్యక్తి నటుడు విజయ్ దేవరకొండ అని, పుష్ప -3లో ఆయన హీరోగా కనిపించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై నటి రష్మిక స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక దీనిపై మాట్లాడుతూ.. తనకూ ఈ విషయం తెలియదన్నారు. డైరెక్టర్ సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తుంటారని, చివరి వరకూ విషయాన్ని బయటపెట్టరని అన్నారు. పుష్ప -2కు సంబంధించిన విషయాలను సైతం షూటింగ్ సమయంలోనే తమకు చెప్పేవారన్నారు. సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి .. అతనెవరు అని తాను ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.