సతీసమేతంగా నాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు తాత్కాలిక బెయిల్
- నిన్న జైలు నుంచి విడుదల
- నేడు మెగా బ్రదర్స్ ను కలిసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ఇవాళ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ లంచ్ చేసిన అనంతరం నాగబాబు నివాసానికి వెళ్లారు.
తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అల్లు అర్జున్ ను ఆత్మీయంగా హత్తుకుని, ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనను, కేసు వివరాలను అల్లు అర్జున్... నాగబాబుకు వివరించారు. ఈ కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ అండగా నిలవడం పట్ల బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు.