టీమిండియా బ్యాటింగ్ కోచ్ వల్ల ఉపయోగం ఏంటి?: మంజ్రేకర్

  • ఆసీస్ పర్యటనలో టీమిండియా బ్యాట్స్ మెన్ విఫలం
  • బ్యాటింగ్ కోచ్ ఏంచేస్తున్నాడన్న మంజ్రేకర్
  • బ్యాటింగ్ కోచ్ అవసరమా, కాదా అనేది పరిశీలించాలని వెల్లడి 
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ స్టార్లు ఘోరంగా విఫలమవుతుండడం పట్ల మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా స్పందించాడు. టీమిండియా జట్టులో బ్యాటింగ్ కోచ్ ప్రభావం ఏమైనా కనిపిస్తోందా? అని ప్రశ్నించాడు. టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ ఉండాలా, వద్దా అనే అంశాన్ని పరిశీలించాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. 

టీమిండియా బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమవుతుంటే, జట్టులో బ్యాటింగ్ కోచ్ ఉన్నట్టా, లేనట్టా? అని వ్యాఖ్యానించాడు. జట్టుతో పాటే బ్యాటింగ్ కోచ్ కూడా ఉన్నప్పటికీ, జట్టులోని ప్రధాన బ్యాట్స్ మెన్ లోపభూయిష్టమైన ఆటతీరుతో ఇంకా ఎందుకు సతమతమవుతున్నారు? జట్టులో బ్యాటింగ్ కోచ్ పాత్ర ఏమిటి? అంటూ మంజ్రేకర్ సూటిగా ప్రశ్నించాడు. 

ఇవాళ గబ్బాలో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం పర్యాటక జట్టు దయనీయ స్థితిని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో, మంజ్రేకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


More Telugu News