ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

  • ఏపీలో 53 బార్ల కేటాయింపుకు నేటి నుంచి ధరఖాస్తుల స్వీకరణ
  • 2025 ఆగస్టు 31 వరకూ లీజు అనుమతి  
  • ఈ నెల 22 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు
ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేలం నిర్వహిస్తారు. 

ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఈ బార్లకు లైసెన్సు గడువు 2025 అగస్టు వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు బార్‌లకు సంబంధించి వేలం నిర్వహించగా, కొన్ని బార్లు మిగిలిపోయాయి. వీటికి తాజాగా వేలం నిర్వహిస్తున్నారు. 

ఈ బార్లకు సంబంధించి నాన్ రిఫండబుల్ ఫీజు విషయానికి వస్తే .. 50 వేల జనాభా లోపు ఉన్న ప్రాంతాలలో బార్లకు రూ.5లక్షలుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు రూ.7.5 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాలలో బార్లకు రూ.10 లక్షలుగా ఫీజు నిర్ధారించారు. 


More Telugu News