అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలోకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సభ్యులు ఉదయమే డ్రింక్ చేసి సభకు వస్తున్నారని ఆరోపించారు. సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. అందుకే అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని సభాపతిని హరీశ్‌రావు కోరారు.