రూ.3 వేల లాటరీ తగిలింది.. ఆ డబ్బుతో టికెట్ కొంటే రూ.25 కోట్లు వచ్చాయి
- ఓ సాధారణ లాటరీ టికెట్ కొన్న వ్యక్తి
- దానికి రూ.3,360 (40 డాలర్లు) బహుమతి
- అదే డబ్బుతో మరో లాటరీ టికెట్ కొంటే... ఏకంగా రూ.25 కోట్ల ప్రైజ్ మనీ
- అదృష్టం వెంట వస్తే ఇలాగే ఉంటుందనే కామెంట్లు
ఎవరికైనా లాటరీ తగలడం ఓ అదృష్టం. కానీ అంతకన్నా పెద్ద అదృష్టం ముందుంటే... అది కూడా ఆ లాటరీనే ఆ పెద్ద అదృష్టాన్ని తెచ్చిపెడితే! భలేగా ఉంటుంది కదా. అలాంటిదే అమెరికాలో ఓ వ్యక్తికి ఎదురైంది. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని రాడ్ క్లిఫ్ కు చెందిన ఆయన ఓ చిన్న లాటరీ టికెట్ కొన్నాడు. ఆయనకు సుమారు రూ.3,300 (40 డాలర్లు) బహుమతి వచ్చింది.
అదే డబ్బు నుంచి కొని..
40 డాలర్ల బహుమతి వచ్చిన ఆయన... ఇంతకన్నా పెద్ద లాటరీ తగలకపోదా అని భావించాడు. ఆ బహుమతి సొమ్ములో నుంచే 30 డాలర్లు (సుమారు రూ.2,500) పెట్టి.. కెంటకీ లాటరీకి చెందిన ‘బ్రేక్ ఫోర్ట్ నాక్స్’ స్క్రాచ్ కార్డు టికెట్ ను కొన్నాడు. దాన్ని స్క్రాచ్ చేసి చూసి నోరెళ్ల బెట్టాడు. ఎందుకంటే ఆయనకు ఆ లాటరీలో ఏకంగా 3 మిలియన్ డాలర్లు (రూ.25.2 కోట్లు) ప్రైజ్ మనీ వచ్చింది.
ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్నా..
‘‘లాటరీ టికెట్ కొని స్క్రాచ్ చేసి నంబర్ చూశాను. ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాను. లాటరీ కంపెనీ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాను. నాకు మూడు మిలియన్ డాలర్ల బహుమతి వచ్చింది. ఏదో ఒకరోజు నాకు అదృష్టం వస్తుందని తెలుసు. అందరితో నా ఆనందం పంచుకున్నాను. అప్పులన్నీ తీర్చేసి, కొంత సొమ్ము దాచుకుని.. సరదాగా ప్రయాణాలు చేయాలన్నది నా కోరిక’’ అని బహుమతి గెలిచిన వ్యక్తి పేర్కొనడం గమనార్హం.