అల్లు అర్జున్ నివాసంపై దాడిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన
- అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలు
- ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదన్న కోమటిరెడ్డి
- శాంతిభద్రతలకు ఎవరూ విఘాతం కలిగించవద్దని సూచన
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన హీరో అల్లు అర్జున్ కు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోకి ప్రవేశించిన ఓయూ జేఏసీ నేతలు... అక్కడ విధ్వంసం సృష్టించారు. టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూలకుండీలు పగలగొట్టారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని నినాదాలు చేస్తూ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు. సంధ్య థియేటర్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
మరోవైపు, అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ వెంటనే వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.