ఏపీకి తొలగని వాన ముప్పు... భారీ వర్షాలు కురుస్తాయన్న ఏపీఎస్డీఎంఏ

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు బాగా దగ్గరగా ఉందన్న ఐఎండీ
  • ప్రత్యేక అలర్ట్ జారీ చేసిన ఏపీఎస్డీఎంఏ
నైరుతి బంగాళాఖాతం, పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు అత్యంత చేరువలో అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఈ అల్పపీడనం రేపు (డిసెంబరు 24) కూడా నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) ప్రత్యేక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి వాన ముప్పు తొలగిపోలేదని స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నాడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ, విశాఖ, అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

అదే సమయంలో చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. 



More Telugu News