ఆహాలోకి అడుగుపెడుతున్న మరో ప్రేమకథ!

  • కార్తికేయన్ దర్శకత్వంలో కథాకమామీషు'
  • దర్శకుడు కరుణకుమార్ అందించిన కథ
  • గ్రామీణ నేపథ్యలో సాగే ప్రేమకథ
  • త్వరలో స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్న ఆహా

ప్రేమకథలు ఎప్పుడూ ఆసక్తిని పెంచుతూనే ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలోని లవ్ స్టోరీస్ మరింత కుతూహలాన్ని పెంచుతూ ఉంటాయి. అందుకు కారణం పల్లె ప్రేమలో స్వచ్ఛత వేరు ..  పరిమళం వేరు. అందువలన విలేజ్ నేపథ్యంలో నడిచే ప్రేమకథలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు.

అలాంటి ఓ ప్రేమకథ ఇప్పుడు 'ఆహా' ప్రేక్షకులను పలకరించనుంది. 'కథా కమామీషు' అనే సినిమా గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. 'మట్కా' దర్శకుడు కరుణ కుమార్ అందించిన కథతో ఈ సినిమా నిర్మితమైంది. దర్శకుడిగా కార్తికేయన్ వ్యవహరించాడు. త్వరలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా 'ఆహా' వారు ప్రకటించారు.

 అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. మొయిన్ - కృష్ణతేజ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా ఇది. పోస్టర్ చూస్తుంటేనే గ్రామీణ నేపథ్యంలో సాగే ఫీల్ తో కూడిన ప్రేమకథ అనే విషయం అర్థమవుతోంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి మరి.


More Telugu News