చేయని నేరానికి జైలుకెళితే .. నెట్ ఫ్లిక్స్ లో సర్వైవల్ థ్రిల్లర్!

  • తమిళంలో విడుదలైన 'సొర్గవాసల్'
  • ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • జైలు చుట్టూ తిరిగే కథ  
  • ఐదు భాషల్లో అందుకుబాటులోకి రానున్న సినిమా  

తమిళంలో ఈ ఏడాది చివరిలో వచ్చిన సినిమాలలో 'సొర్గవాసల్' ఒకటి. ఆర్జే బాలాజీ హీరోగా నటించిన ఈ సినిమాలో, సెల్వ రాఘవన్ .. నటరాజ సుబ్రమణియన్ కీలకమైన పాత్రలను పోషించారు. సిద్ధార్థ్ రావు - పల్లవి సింగ్ నిర్మించిన ఈ సినిమాకి, సిద్ధార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, కంటెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

అలాంటి ఈ సినిమా ఈ నెల 27 నుంచి 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 1999లో తమిళనాడులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా, జైలు చుట్టూ తిరుగుతుంది. 

ఈ సినిమాలో హీరో ఒక చిన్న పని చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అనుకోకుండా జరిగిన ఒక పోలీస్ ఆఫీసర్ మరణం, అతని మెడకు చుట్టుకుంటుంది. దాంతో అతను జైలుకు వెళతాడు. అక్కడ రెండు గ్యాంగుల మధ్య జరిగే గొడవలు అతణ్ణి టచ్ చేస్తాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఏమౌతుంది? అనేది కథ.


More Telugu News