కిమ్ సైనికులను వెంటాడి వేటాడిన ఉక్రెయిన్ డ్రోన్.. వైరల్ వీడియో ఇదిగో!
- రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ తో పోరాడుతున్న కిమ్ సైనికులు
- కుర్క్స్ సరిహద్దుల్లో సుమారు 10 వేల మంది సోల్జర్ల మోహరింపు
- కమికేజ్ డ్రోన్ తో మూడు రోజుల్లో 77 మంది కొరియా సైనికుల హతం
రష్యాకు మద్దతుగా పోరాడుతున్న కిమ్ సైనికులను ఉక్రెయిన్ డ్రోన్ పరుగులు పెట్టించింది. వేటాడుతూ కాల్పులు జరిపి తుదముట్టించింది. మూడు రోజుల వ్యవధిలో 77 మంది ఉత్తర కొరియా సైనికులను హతమార్చింది. సైనికులను వెంటాడి వేటాడుతున్న డ్రోన్ ఫుటేజీని ఉక్రెయిన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్యాలోని కుర్క్స్ సరిహద్దుల్లో ఎగరేసిన డ్రోన్ రికార్డు చేసిన ఫుటేజీ అని తెలిపింది.
పుతిన్ తో స్నేహ బంధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న తన సైనికులను యుద్ధానికి పంపించారు. రష్యా తరఫున కిమ్ సైనికులు ఉక్రెయిన్ సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. కిమ్ సైనికులను రష్యా అధికారులు కుర్క్స్ సరిహద్దుల్లో మోహరించారు. ఉక్రెయిన్ చొరబాటును అడ్డుకోవడానికి మూడు గ్రామాల్లో ఏకంగా పదివేల మందికి పైగా సైన్యాన్ని దింపారు.
అయితే, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం, భాష తెలియకపోవడం కిమ్ సైనికులకు అడ్డంకిగా మారింది. దీనిని అవకాశంగా మలుచుకున్న ఉక్రెయిన్ బలగాలు.. కమికేజ్ డ్రోన్లతో కిమ్ సైనికులను వేటాడుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో.. సైనికులను తరుముతూ డ్రోన్ కాల్పులు జరపడం కనిపిస్తోంది. ఒక్కో సైనికుడిని మట్టుబెట్టుకుంటూ డ్రోన్ ముందుకు సాగడం చూడొచ్చు.