ప్రతి రూపాయి ఖర్చుపై రూ.2.52 ఆదాయం పొందుతున్నాం: ఇస్రో చీఫ్ సోమనాథ్
- అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న ఇస్రో
- ఆదాయంలోనూ ముందడుగు
- 2040లో చంద్రుడిపైకి మనిషి
భారతదేశం అంతరిక్షరంగంలో దూసుకుపోతోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అంతరిక్ష రంగంపై చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు రూ.2.52 రూపాయల ఆదాయం పొందుతున్నట్టు తెలిపారు.
2040 నాటికి చంద్రుడికిపైకి వ్యోమిగామిని పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయత్వంలో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ. 31,000 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు సోమ్‌నాథ్ వెల్లడించారు. రాబోయే 15 ఏళ్లలో ఇస్రో చేపట్టనున్న ప్రయోగాల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్టు వివరించారు.
ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తాజాగా ఎన్డీటీవీతో ముచ్చటించారు. ఇస్రో చేపట్టబోతున్న ప్రయోగాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ వివరాలను ఆయన పంచుకున్నారు. విస్తృత లక్ష్యంతో ప్రయోగాలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. 2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగా 2028లో తొలి మాడ్యూల్ ప్రయోగం చేపట్టనున్నామని, 2035 నాటికి పూర్తిస్థాయిలో ఈ అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి రానుందని చెప్పారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటుతో పాటు 2040 నాటికి భారత్ సొంతంగా చంద్రుడి మీదకు వ్యోమగామిని పంపడమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు డాక్టర్ సోమ్‌నాథ్ ఎన్డీటీవీకి తెలిపారు.
భారత్ వంద సంవత్సరాల స్వతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకునే సమయానికి చంద్రుడిపై అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని అన్నారు. దీనికి ముందే చంద్రయాన్ 4ను ప్రయోగించనున్నామని, లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్‌కు కూడా ఇప్పటికే ఆమోదం లభించినట్టు ఆయన తెలిపారు.
అంతరిక్షయానం కోసం వినియోగిస్తున్న ఇంధనానికి ప్రత్యమ్నాయ ఇంధన వనరులపై ప్రయోగాలు చేస్తున్నట్టు డాక్టర్ సోమ్‌నాథ్ తెలిపారు. శుక్రగ్రహంపై ప్రయోగాలకు కూడా ఆమోదం లభించినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.