జమ్ము కశ్మీర్ లో 150 అడుగుల లోయలో పడిన వాహనం... ఐదుగురు జవాన్ల మృతి
- పూంఛ్ సెక్టార్లో ఘోర ప్రమాదం
- నీలమ్ నుంచి బల్నోయి ఘోరా పోస్ట్ వద్దకు వెళుతున్న సైనికులు
- వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిన వైనం
- మృతులు నెంబర్ 11 మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కు చెందినవారు
జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ లో ఓ సైనిక వాహనం 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. మృతి చెందిన జవాన్లు నెంబర్ 11 మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కు చెందినవారు. వీరంతా క్విక్ రియాక్షన్ టీమ్ (QRT) లో సభ్యులు.
సైనిక వాహనం నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణిస్తుండగా, పూంఛ్ సెక్టార్లో ఈ ప్రమాదం జరిగింది. సైనికులు నీలమ్ ప్రాంతంలో ఉన్న స్థావరం నుంచి బల్నోయి ఘోరా పోస్ట్ వద్దకు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు సహాయచర్యలు ప్రారంభించారు.