వుమెన్ క్రికెట్... విండీస్‌పై 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

  • తొలుత 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసిన భారత్
  • 243 పరుగులకే ఆలౌట్ అయిన విండీస్ 
  • హేలీ మాథ్యూస్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ తప్పని ఓటమి
  • 2-0తో సిరీస్ టీమిండియా కైవసం
వడోదర వేదికగా విండీస్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. విండీస్‌పై భారత్ 115 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది.

విండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ శతకంతో (106) అదరగొట్టింది. అయినప్పటికీ విండీస్ కు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ, సాధు, ప్రతీక రావల్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. ప్రియామిశ్రా మూడు, రేణుకా ఠాకూర్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ 103 బంతుల్లో 16 ఫోర్లతో 115 పరుగులు చేశారు. ఆమెను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ప్రతీక రావల్ 76, స్మృతి మంధన 53, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగ్స్ 52 పరుగులు చేశారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. 



More Telugu News