మీ గురించి తప్పుగా మాట్లాడలేదు సర్.... జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కౌశిక్ తల్లి
- క్యాన్సర్ బాధిత అభిమానికి కౌశిక్ కు ఎన్టీఆర్ చేయూత
- రూ.12 లక్షల బిల్లు కట్టిన ఎన్టీఆర్
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కౌశిక్
క్యాన్సర్ తో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఇవాళ చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. కౌశిక్ ను ఆదుకుంటానంటూ గతంలో మాటిచ్చిన ఎన్టీఆర్, ఆ తర్వాత పట్టించుకోవడంలేదంటూ నిన్న కథనాలు వచ్చాయి. కౌశిక్ తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి తమ పరిస్థితి పట్ల ఆవేదన వెలిబుచ్చారు. తాజాగా, ఆమె జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ "నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ టీమ్ వాళ్లు కాల్ చేసి, ఏమైందమ్మా అని అడిగారు. ఏమిటి మీడియా ముందుకు వచ్చావు అని అడిగారు. ఇదీ సార్ పరిస్థితి అని చెప్పేసరికి, నాతో ఓసారి కాల్ లో మాట్లాడించవచ్చు కదమ్మా అని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీమ్ వాళ్లు వచ్చి, రూ.12 లక్షలు బిల్లు కట్టి మా అబ్బాయి డిశ్చార్జి అయ్యేందుకు తోడ్పాటు అందించారు.
ఎన్టీఆర్ సర్... నేను మీ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. మా కుటుంబం అంతా మీ ఫ్యాన్సే సర్. ఎప్పుడైనా టీవీలో మీ స్పీచ్ వింటే, పిల్లాడు అంటే ఇలా ఉండాలని మా వాళ్లందరూ అనుకుంటుంటారు సర్. మీ అందరి సపోర్ట్ వల్ల ఇవాళ మా అబ్బాయి డిశ్చార్జి అవుతున్నాడు. థాంక్యూ సర్.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా మాటల వల్ల ఇబ్బంది పడినట్టున్నారు... ఎన్టీఆర్ సర్ గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు... మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టే, ఇవాళ ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జి అయ్యాడు. మీ అందరికీ కృతజ్ఞతలు" అని వివరించారు.