వాజపేయి శతజయంతి సందర్భంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ట్వీట్లు

  • అఖండ భారత్ కోసం కలలు కన్న దార్శనికుడు వాజపేయి అని ట్వీట్
  • తన జీవితాన్ని భారతమాత సేవకు అంకితమిచ్చిన దేశభక్తుడన్న సంజయ్
  • వాజపేయి సేవలు ఎప్పటికీ చెరపలేనివన్న కిషన్ రెడ్డి
అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. అఖండ భారతం కోసం కలలు కన్న దార్శనికుడు వాజపేయి అని పేర్కొన్నారు. భారతజాతికి శాంతిమంత్రం జపించడమే కాదు... యుద్ధతంత్రం తెలుసునని నిరూపించిన నాయకుడన్నారు. సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనాదక్షుడని... తన జీవితాన్ని భారతమాత సేవకై అంకితమిచ్చిన దేశభక్తుడని పేర్కొన్నారు.

శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న అజాత శత్రువు వాజపేయి అని, అఖండ భారతం కోసం కలలు కన్న దార్శనికుడని పేర్కొన్నారు. తన కవిత్వంతో జాతి ఊపిరిలో నిత్యం నిలిచిన అమరుడు... మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారు అంటూ ట్వీట్ చేశారు. ఆ మహనీయుడి శతజయంతి సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు అంటూ ప్రజలందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశాన్ని ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే ముందుకు నడిపించామని, ఇదే భారత ప్రజాస్వామ్యం గొప్పబలమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. వాజపేయి శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశానికి వాజపేయి చేసిన సేవలు ఎప్పటికీ చెరపలేనివని రాసుకొచ్చారు. ఆయన సుపరిపాలన, నేషన్ ఫస్ట్ వంటివి శాశ్వతమైనవి... ఆదర్శవంతమైనవి అని పేర్కొన్నారు. ఇలాంటివి మనకు ఎప్పటికీ మార్గదర్శకమన్నారు.


More Telugu News