'దేవర' విషయంలో నాకు అనిపించింది అదే: 'సితార' నాగవంశీ!

  • వరుస సినిమాలతో దూసుకెళుతున్న నాగవంశీ
  • తమకి ఎవరితో పోటీలేదని వ్యాఖ్య 
  • 'దేవర' విషయంలో రిస్క్ చేశానని వెల్లడి 
  • త్వరలో విడుదలవుతున్న 'డాకు మహారాజ్'

టాలీవుడ్ లో సితార బ్యానర్ కి మంచి పేరు ఉంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. నిర్మాతగా నాగవంశీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఈ బ్యానర్ నుంచి ఇటీవల వచ్చిన 'లక్కీ భాస్కర్' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇదే బ్యానర్లో బాలకృష్ణ కథానాయకుడిగా చేసిన 'డాకు మహారాజ్' త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగవంశీ 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడారు. 

'డాకు మహారాజ్' సినిమా పట్ల నమ్మకంతో నేను మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. కానీ నిజానికి నా సినిమాను గురించి నేనే కదా నమ్మకంతో చెప్పాలి. నాకు యాటిట్యూడ్ ఎక్కువని అనుకుంటే నేనేం చేయలేను .. అందులో నిజం లేదని అందరికీ చెప్పడం కూడా సాధ్యం కాదు. సితార బ్యానర్ ఎవరికి పోటీ కాదు. మా సినిమాలు చేస్తూ మేము ముందుకు వెళుతున్నాం .. అంతే" అని అన్నారు. 

'దేవర' సినిమా విషయానికి వస్తే, ఎన్టీఆర్ నుంచి కొంత గ్యాప్ తరువాత వచ్చిన సినిమా అది. ఆ సినిమా విషయంలో నేను కూడా ఒక భాగం కావాలని అనుకున్నాను. అందుకోసం చాలా రిస్క్ చేసి తీసుకున్నాను. నా డిస్ట్రిబ్యూటర్లతో నేను మాట్లాడిన తరువాతనే ఆ నిర్ణయం తీసుకున్నాను. తారక్ ఆశించిన స్థాయిలో ల్యాండ్ చేయగలిగాను.  ఫస్టాఫ్ నాకు నచ్చింది .. సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి, అది ఫస్టాఫ్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు" అని చెప్పారు.



More Telugu News