తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. సంధ్య థియేట‌ర్ యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం!

  • ఈ నెల 4న 'పుష్ప‌-2' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా తొక్కిస‌లాట ఘ‌ట‌న‌
  • ఈ నేప‌థ్యంలో సంధ్య థియేట‌ర్‌లో మ‌ర‌మ్మ‌తులు
  • పాత సీసీ కెమెరాల‌ స్థానంలో అధునాత‌న‌మైన కొత్త సీసీ కెమెరాలు
  • గేట్ల‌కు బోర్డులు, మెట‌ల్ డిటెక్ట‌ర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటు
హైద‌రాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేట‌ర్‌లో ఈ నెల 4న 'పుష్ప‌-2: ది రూల్' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ చ‌నిపోగా, తీవ్ర గాయాల‌తో ఆమె తొమ్మిదేళ్ల‌ కుమారుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సదరు థియేట‌ర్ య‌జ‌మానులు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. థియేట‌ర్ లోప‌ల‌, బ‌య‌ట పూర్తిగా మ‌ర‌మ్మ‌తులు చేయిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దీనిలో భాగంగా పాత సీసీ కెమెరాల‌ను తొల‌గించి, వాటి స్థానంలో అధునాత‌న‌మైన కొత్త సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

అలాగే రెండు థియేట‌ర్ల (సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం) గేట్ల‌కు బోర్డులు, కొత్త గ్రిల్స్, మెట‌ల్ డిటెక్ట‌ర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా య‌జ‌మానులు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 


More Telugu News