12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. 578 మంది మనవలు.. ఆ వ్యక్తి ఈయనే.. వీడియో ఇదిగో!

  • తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన ముసా హసహ్యా కసేరా
  • 1972లో 17 ఏళ్ల వయసులో తొలి వివాహం
  • పిల్లల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి రిజిస్టర్ నిర్వహిస్తున్న ముసా
ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నా దాదాపు దేశాలన్నీ అధిక జనాభాతో బాధపడుతున్నాయి. బహుశా అందుకు కారణం ఇలాంటి వారి వల్లే కావచ్చు. ఉగాండాకు చెందిన ఈ వ్యక్తికి 12 మంది భార్యలున్నారు. వారి ద్వారా ఆయనకు 102 మంది సంతానం కలిగారు. వారికి పెళ్లిళ్లు చేయడం ద్వారా మొత్తంగా 578 మందికి తాతయ్యాడు. వారి పేర్లను గుర్తుంచుకునేందుకు ఏకంగా రిజిస్టర్‌నే నిర్వహించాల్సి వస్తోంది. 

102 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆ వ్యక్తి పేరు ముసా హసహ్యా కసేరా. తూర్పు ఉగాండాలోని ముకిజా గ్రామం. ఆయన వయసు ప్రస్తుతం 70 సంవత్సరాలు. ఒక్కో భార్య నుంచి 8, 9 మంది పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు తన సంతానాన్ని పెంచేందుకు, వారి కడుపు నింపేందుకు నానా పాట్లు పడుతున్నాడు. 1972లో ముసా తొలి వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లే. అనంతరం ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 12 మందిని చేసుకున్నాడు. అయితే, ఇంతమందిని చేసుకుంటూ పోయినా వారిని ఎలా పోషించగలనన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదని ముసా చెప్పుకొచ్చాడు. ‘దిఇండోట్రెక్కర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.


More Telugu News