మన్మోహన్ సింగ్ కన్నుమూసింది ఈ ప్రమాదకర అనారోగ్య సమస్యతోనే

  • శ్వాసకోశ వ్యాధితో బాధపడిన మన్మోహన్ సింగ్
  • ఈ మధ్యకాలంలో పలు హాస్పిటల్స్‌‌ను సందర్శించి చెకప్‌లు చేయించుకున్న మాజీ ప్రధాని
  • గురువారం కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది
  • అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో ఎయిమ్స్‌కు తరలించిన కుటుంబ సభ్యులు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. రాత్రి 9.51 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఇంట్లో ఒక్కసారిగా స్పృహ తప్పారని, రాత్రి 8.06 గంటల సమయంలో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకొచ్చారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వివరించారు.

అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పలు వృద్ధాప్య సమస్యలతో పాటు ప్రమాదకరమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డారు. ఈ వ్యాధికి చికిత్స కోసం ఈ మధ్య ఆయన పలు హాస్పిటల్స్‌ను సందర్శించి చెకప్‌లు చేయించుకున్నారు. గురువారం కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో అత్యంత క్రిటికల్ పరిస్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనను చేర్పించారు. వైద్యులు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

కాగా, శ్వాసకోశ వ్యాధి ఊపిరితిత్తులతో పాటు శ్వాస వ్యవస్థలో ఇతర భాగాలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. వాయు కాలుష్యం, ధూమపానం, ఇన్ఫెక్షన్లు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.


More Telugu News