అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న... పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
- వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన ఎంపీడీవోను రిమ్స్‌లో పరామర్శించిన డిప్యూటీ సీఎం
- ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్
- అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియా
- సంబంధం లేని ప్రశ్న అన్న జనసేనాని
- మీ కుటుంబ సభ్యుడు కదా అంటూ తిరిగి ప్రశ్నించిన మీడియా ప్రతినిధి
- ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే సినిమాల గురించి మాట్లాడటమేమిటని అసహనం
సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ అరెస్ట్ వ్యవహారంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆయన సమాధానం దాటవేశారు.
ఈరోజు పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఆయన గాయపడ్డారు. జవహర్ బాబును పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అని పవన్ కల్యాణ్ అన్నారు.
కానీ అల్లు అర్జున్ మీ కుటుంబ సభ్యుడు కదా? అంటూ మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు.
ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడటమేమిటని పవన్ కల్యాణ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. ఈ చర్చను సినిమాల వైపు మళ్లించవద్దని, వైసీపీ అరాచకం, దాడులను చూడాలన్నారు. మీడియా పెద్ద మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.