'జబర్దస్త్'లో అందరికంటే నాకే ఎక్కువ ఇచ్చేవారు: చమ్మక్ చంద్ర

  • ముందుగా సినిమాల్లోనే ఎంట్రీ ఇచ్చానన్న చమ్మక్ చంద్ర  
  • 'జబర్దస్త్' వల్లనే గుర్తింపు వచ్చిందని వివరణ  
  • టీమ్ లీడర్ గా చాలా కష్టపడ్డానని వెల్లడి
  • నాగబాబు గారు పెద్దదిక్కుగా ఉండేవారని వ్యాఖ్య

చమ్మక్ చంద్ర .. ఈ పేరు వినగానే, 'జబర్దస్త్' స్టేజ్ పై ఆయన చేసిన స్కిట్లు గుర్తుకు వస్తాయి .. నవ్వు తెప్పిస్తాయి. ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి నాకు కామెడీ అంటే ఇష్టం. ఫలానా సినిమాలో హీరోలు ఎవరనేది కాకుండా, కమెడియన్స్ ఎవరున్నారా అని చూసేవాడిని. పోస్టర్స్ పై కోట .. బ్రహ్మానందం .. బాబు మోహన్ కనిపిస్తే ఆ సినిమాకి వెళ్లిపోయేవాడిని" అని అన్నాడు.

'జబర్దస్త్'లోకి రావడానికి ముందే 30 - 40 సినిమాలలో చిన్నాచితకా వేషాలు వేశాను కానీ గుర్తింపు రాలేదు. 'జబర్దస్త్'లో నా టైమింగ్ నచ్చడంతో నన్ను టీమ్ లీడర్ ను చేశారు. అప్పటి నుంచి మరింత కష్టపడ్డాను. స్క్రిప్ట్ రాసుకోవడం .. రిహార్సల్స్ చేయించడం ..స్కిట్ కి తగినట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ వెళ్లాను. భార్యాభర్తలకి సంబంధించిన స్కిట్స్ నాకు ఎక్కువ పేరును తెచ్చిపెట్టాయి. అప్పట్లో అందరికంటే కూడా నా పారితోషికం ఎక్కువగా ఉండేది" అని చెప్పాడు. 

'జబర్దస్త్' నుంచి రెగ్యులర్ గా ఒక ఇన్ కమ్ వచ్చేది .. అందువలన ధైర్యం ఉండేది. టీమ్ లోని మిగతా వారికి వారి పాత్రల ప్రాముఖ్యతను బట్టి ఎమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నాగబాబుగారు మా అందరికీ పెద్దదిక్కులా ఉండేవారు. డబ్బు విషయంలో .. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెబుతూ ఉండేవారు. మాలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుండేవారు" అని చెప్పారు. 



More Telugu News