ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

  • కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో విజయసాయికి ఈడీ నోటీసులు
  • ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు
  • బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన విజయసాయి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో ఆయన హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. కేసు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు.


More Telugu News