కేజీఎఫ్ తరువాత మరోసారి వైల్డ్‌ లుక్‌లో యష్‌

  • కేజీఎఫ్ తరువాత మరోసారి వైల్డ్‌ లుక్‌లో యష్‌ 
  • యష్‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా 'టాక్సిక్‌' లుక్‌ విడుదల 
  • కేజీఎఫ్‌ తరువాత మరోసారి మాస్‌ లుక్‌లో యష్‌
'కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న కన్నడ కథానాయకుడు యష్‌. 'కేజీఎఫ్‌'లో ఆయన మాస్‌ లుక్‌కు, మాస్‌ అవతార్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేజీఎఫ్‌-2 తరువాత మరో సినిమా అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నారు యష్‌. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'టాక్సిక్‌'. 

పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వంలో మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. కాగా నేడు జనవరి 8న హీరో యష్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్‌ నుంచి బర్త్‌డే పీక్‌ అంటూ యష్‌ బర్త్‌డే ట్రీట్‌ను వదిలారు నిర్మాతలు. 

గ్లింప్స్‌ చూస్తుంటే బోల్డ్‌ కంటెంట్‌తో హాట్‌గా ఉంది. చిత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండబోతుందని, కొత్తదనం కోసం తపించే యష్‌ ఈ చిత్రంలో ఎంతో డిఫరెంట్‌గా, మోర్‌ మాసివ్‌గా కనిపించబోతున్నాడని అంటోంది చిత్ర యూనిట్‌. భారీ ఖర్చుతో, ప్రముఖ తారాగణంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేక్షకులు ఎన్నో షాకింగ్‌ అంశాలను చూస్తారని, వారికి సరికొత్త అనుభూతిని పంచే చిత్రంగా ఇది ఉండబోతుందని దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ చెబుతున్నారు 






More Telugu News