సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిహారిక స్పందన

  • మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానన్న నిహారిక
  • అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వ్యాఖ్య
  • రామ్ చరణ్ అన్నతో చాలా సరదాగా ఉంటానన్న నిహారిక
'పుష్ప2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సినీనటి నిహారిక తొలిసారి స్పందించారు. 

ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని నిహారిక చెప్పారు. మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. అందరి మద్దతుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని చెప్పారు. తన తాజా చిత్రం 'మద్రాస్ కారన్' ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుంటుంటానని నిహారిక చెప్పారు. కథల ఎంపికలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ ను సంప్రదిస్తానని తెలిపారు. రామ్ చరణ్ అన్నతో ఎంతో సరదాగా ఉంటానని చెప్పారు. లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి సినిమాకు ఆయన స్టైల్ మారుస్తుంటారని చెప్పారు. మరోవైపు నిహారిక హీరోయిన్ గా నటించిన 'మద్రాస్ కారన్' సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.


More Telugu News