రఘురామ చిత్రహింసల కేసు: విజయపాల్ ను ఒంగోలుకు తరలింపు

  • గత ప్రభుత్వ హయాంలో రఘురామకు చిత్రహింసలు
  • రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్
  • ఒక్క రోజు పోలీస్ కస్టడీకి అప్పగించిన గుంటూరు కోర్టు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను గుంటూరు కోర్టు ఒక్కరోజు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు విజయ్ పాల్ కు న్యాయస్థానం కస్టడీ విధించింది. 

ఈ నేపథ్యంలో, రిమాండ్ ఖైదీగా ఉన్న విజయ్ పాల్ ను పోలీసులు గుంటూరు నుంచి ఒంగోలుకు తరలించారు. ఈ ఉదయం ఆయనను గుంటూరు జైలు నుంచి తీసుకువచ్చిన ప్రకాశం పోలీసులు... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఒంగోలు తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విజయ్ పాల్ ను 24 గంటల పాటు విచారించనున్నారు.


More Telugu News