గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు

  • సంక్రాంతి సందర్భంగా వస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్
  • 14 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వ అనుమతి
  • 14 రోజులను 10 రోజులకు కుదించిన హైకోర్టు
సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల 10న రామ్ చరణ్ చిత్రం 'గేమ్ ఛేంజర్', 12న బాలకృష్ణ మూవీ 'డాకు మహరాజ్' విడుదల కాబోతున్నాయి.

'గేమ్ ఛేంజర్', 'డాకు మహరాజ్' టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, టికెట్ ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపు జరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లలో వారు కోరారు.

ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించగా... ఆ అనుమతిని హైకోర్టు 10 రోజులకు కుదించింది. హైకోర్టు తీర్పు మేరకు సినిమాలు విడుదలైన 10 రోజుల వరకు పెంచిన టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. హైకోర్టు నిర్ణయంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది.


More Telugu News