అల్లు అర్జున్, నేను నవ్వుకున్నాం: పుష్ప-2 మీద తన వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ వివరణ

  • పుష్ప-2 చిత్రం మీద తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న రాజేంద్ర ప్రసాద్
  • ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు మాట్లాడుకున్నట్లు వెల్లడి
  • ఆన్‌లైన్‌లో వచ్చిన పోస్టులు చూసి నవ్వుకున్నామని వెల్లడి
పుష్ప-2 చిత్రంలో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని, ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు ఇదే విషయమై మాట్లాడుకున్నామని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన పోస్టులను చూసి తామిద్దరం నవ్వుకున్నామన్నారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో ఈతరం సినీ నటులను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగిటివ్‌గా చూడకూడదన్నారు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై ప్రతిబంబిస్తున్నామన్నారు. లేడీస్ టేలర్, అప్పుల అప్పారావు వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణ అన్నారు.

తనకు పద్మ అవార్డు రాకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఏమోనండీ నాకు తెలియదన్నారు. కానీ రామోజీరావు గారు తనను ప్రశంసించడంతో 'పద్మ' కంటే పదిరెట్లు ఎక్కువ ఆనందం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డు ఎందుకు రాలేదని తాను ఎప్పుడూ ఆలోచించలేదన్నారు.


More Telugu News