తెలంగాణకు ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత

  • ఐదేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయన్న కంపెనీ
  • తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసిన యూబీఎల్ ప్రతినిధులు
  • తక్షణమే 'నిలిపివేత' నిర్ణయం అమల్లోకి వస్తుందని లేఖ అందజేత
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) తెలంగాణ రాష్ట్రానికి బీర్ల సరఫరాను నిలిపివేసింది. దాంతో ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోయింది. ఐదేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, దీంతో నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

యూబీఎల్ ప్రతినిధులు ఈరోజు తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్‌ను కలిశారు. తెలంగాణకు అన్ని రకాల బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నామని పేర్కొంటూ లేఖ అందించారు. ధరలు పెంచాలని పలుమార్లు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, దీంతో తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.


More Telugu News