తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పుల్లెల గోపీచంద్

  • ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గోపీచంద్
  • స్పోర్ట్స్ పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రశంస
  • క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు చేపట్టడం శుభపరిణామమన్న గోపీచంద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఇది హర్షణీయమన్నారు. క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.

స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు, తీసుకుంటున్న చర్యలు శుభపరిణామం అన్నారు. తెలంగాణలో క్రీడాకారులను అంతర్జాతీయస్థాయిలో నిలబెట్టేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.


More Telugu News