కోహ్లీ ఒక లెజెండ్.. అతడే నాకు స్ఫూర్తి: ఆసీస్ కొత్త ప్లేయర్

  • కోహ్లీ అంటే చిన్నప్పటి నుంచీ తనకు ఇష్టమన్న కొన్‌స్టాస్
  • తన కుటుంబం మొత్తం కోహ్లీని అభిమానిస్తుందన్న యువ ఆటగాడు
  • పెద్ద స్టార్ అయినా నిరాడంబరంగా ఉంటాడన్న యువ ఆటగాడు
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. 19 ఏళ్ల ఆసీస్ యువ ఆటగాడు శామ్ కొన్‌స్టాస్ మాత్రం కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. చిన్నప్పటి నుంచీ తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. 

కోహ్లీ తన ఆరాధ్య దైవమని, ఈ విషయాన్ని అతడికి కూడా చెప్పానని కొన్‌స్టాస్ తెలిపాడు. తమ కుటుంబం మొత్తం కోహ్లీని అభిమానిస్తుందని పేర్కొన్నాడు. అతడితో కలిసి ఆడటం తనకు దక్కిన గౌరవమని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఒక లెజెండ్ అని, అతడే తనకు స్ఫూర్తి అని అన్నాడు. పెద్ద స్టార్ అయినా ఎంతో నిరాడంబరంగా ఉంటాడని చెప్పాడు. తాను శ్రీలంక పర్యటనకు ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశాడని కొన్‌స్టాస్ పేర్కొన్నాడు.

కోహ్లీ-కొన్‌స్టాస్ మధ్య గొడవ
బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆటలో కోహ్లీ, కొన్‌స్టాస్ మధ్య గొడవ జరిగింది. కొన్‌స్టాస్‌ను కవ్వించేందుకు కోహ్లీ అతడి భుజాన్ని తాకుతూ వెళ్లాడు. దీంతో కోహ్లీని మందలించిన రిఫరీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా కూడా విధించాడు. అయితే, మ్యాచ్ ముగిశాక కోహ్లీ, కొన్‌స్టాస్ ఇద్దరూ మాట్లాడుకుని కలిసి ఫొటోలు దిగడంతో గొడవకు అక్కడితో ఫుల్‌స్టాప్ పడింది. కాగా, బుమ్రాతో గొడవపై కొన్‌స్టాస్ మాట్లాడుతూ ఈ విషయంలో తప్పు తనదేనని అంగీకరించాడు. క్రికెట్‌లో ఇలాంటివి మామూలేనని తేలిగ్గా తీసుకున్నాడు.


More Telugu News