కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచే జైలులో చైనా డ్రోన్ ప్రత్యక్షం
- భోపాల్ సెంట్రల్ జైలు ఆవరణలో డ్రోన్ కలకలం
- అప్రమత్తమైన జైలు అధికారులు
- ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారని పోలీసుల విచారణ
మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలులో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచే అండా సెల్ బయట డ్రోన్ ప్రత్యక్షం కావడం, అదికూడా చైనాకు చెందిన డ్రోన్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకుని సాంకేతిక పరీక్షలు జరుపుతున్నారు. ఆ డ్రోన్ ఎవరిది, ఎవరు పంపించారు, ఎందుకు పంపించారనే వివరాలు తెలుసుకునేందుకు సాంకేతిక నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది.
జైలు అధికారుల వివరాల ప్రకారం.. భోపాల్ సెంట్రల్ జైలులో భయంకరమైన నేరస్థులను ఉంచేందుకు ప్రత్యేకంగా అండా సెల్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సెల్ లో 70 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి అండా సెల్ బయట సెంట్రీ విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఓ డ్రోన్ కనిపించింది. అండా సెల్ ఆవరణలో పడి ఉన్న డ్రోన్ ను చూసి ఆ గార్డు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.
అధికారులు అప్రమత్తమై వెంటనే జైలుకు చేరుకున్నారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకుని సాంకేతిక నిపుణుల బృందంతో పరీక్షలు జరిపిస్తున్నారు. ప్రాథమిక పరిశీలనలో డ్రోన్ కెమెరాకు రెండు లెన్సులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కాగా, గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.