తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్ నివేదిక

  • కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
  • డీఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఘటన  
  • డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో పేర్కొన్న కలెక్టర్  
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు. బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించి, పరిహారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. 

డీఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సక్రమంగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని పేర్కొన్నారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట నిలుపుదల చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదన్నారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందజేశారు. 


More Telugu News