సినిమా కోసం గుండు చేయించుకున్న టాప్ దర్శకుడి కూతురు!
- 'గాంధీ' పాత్ర కోసం గుండు చేయించుకున్న సుకృతి
- ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి
- ఈ నెల 24న రిలీజ్ కానున్న 'గాంధీ తాత చెట్టు'
సినిమాల్లో పాత్రల కోసం.. పాత్రల సహజత్వం కోసం సినిమాలో నటించే హీరోలు శరీరాకృతిని మార్చుకోవడం, అవసరమైతే ఒరిజినల్ గా అనిపించడం కోసం హెయిర్ పెంచడం, గడ్డం పెంచడం లాంటివి చేస్తుంటారు. చాలా తక్కువ మంది నటీనటులు మాత్రమే ఇలా సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం తపిస్తుంటారు. అయితే తొలిసారిగా ఓ బాలనటి సినిమాలో తను పోషిస్తున్న పాత్ర కోసం గుండు చేయించుకోవడం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. 'పుష్ప-2' చిత్రంతో ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ దర్శకుడిగా ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ' గాంధీ తాత చెట్టు'. హృదయానికి హత్తుకునే కాన్సెప్ట్‌తో, ఓ సామాజిక సందేశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సుకుమార్ తనయురాలు సుకృతి వేణి ఓ సన్నివేశంలో గాంధీ వేషధారణలో కనిపించాల్సి వస్తుంది. ఇందుకోసం పాత్ర సహజత్వం కోసం రియల్‌గానే గుండు చేయించుకుంది.
13 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిలెవరు కూడా ఇలాంటి సాహసం చేయడానికి ఇష్టపడరు. అయితే సుకృతి మాత్రం పాత్ర కోసం తన హెయిర్‌ను రీమూవ్ చేసుకుంది. సాధారణంగా దర్శకుడు సుకుమార్ తన సినిమాలు తెరకెక్కించేటప్పుడు ఎంత పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. ఇక తండ్రి బాటలోనే కూతురు కూడా సినిమాలో పర్‌ఫెక్షన్ కోసం, పాత్ర సహజత్వంగా అనిపించడం కోసం గుండు చేయించుకోవడం చూసి అందరూ ఆశ్చర్చపోయారు. అంతేకాదు ఈ సినిమాలో సుకృతి నటన కూడా ఎంతో సహజత్వంగా, చాలా బాగుందని సినిమా చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారు.
పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుకుమార్ భార్య తబితా సుకుమార్ చిత్రానికి సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది.
ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్‌బాబు తన సోషల్ మీడియా ద్వారా ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు.