ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్ కుమార్ గుప్తా

  • డీజీపీగా ముగిసిన ద్వారకా తిరుమలరావు పదవీకాలం
  • నేడు పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి
  • ఏపీ పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తాను నియమించిన ప్రభుత్వం
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. నూతన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. 

కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీకాలం నేటితో ముగిసింది. ఇవాళ ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.


More Telugu News