వూహాన్ ల్యాబ్‌లో కొవిడ్-19ను సృష్టించలేదు, లీక్ చేయలేదు: చైనా

  • వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా లీక్ అయినట్లుగా అనుమానాలు
  • వూహాన్ ల్యాబ్‌లో జన్యుమార్పిడి పరీక్షలు ఎప్పుడూ నిర్వహించలేదన్న చైనా
  • వూహాన్ ల్యాబ్ నుండి కొవిడ్-19 లీక్ కాలేదని స్పష్టీకరణ
వూహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా తెలిపింది. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని ప్రపంచదేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి చైనా మరోసారి స్పందించింది.

వూహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌పై జన్యుమార్పిడి పరీక్షలు ఎప్పుడూ నిర్వహించలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పామని తెలిపింది.

కొవిడ్-19ను సృష్టించడం లేదా వృద్ధి చేయడం లేదా లీక్ చేయడం.. ఇవేమీ ఇక్కడి నుండి జరగలేదని పేర్కొంది. మూలాలు వూహాన్ ల్యాబ్‌లోనే ఉన్నాయనే రాజకీయ ఆరోపణలను వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.


More Telugu News