బద్రీనాథ్ లో భారీగా విరిగిపడ్డ మంచు చరియలు... చిక్కుకుపోయిన 55 మందికి పైగా కార్మికులు

  • ఉత్తరాఖండ్ లో గత రెండ్రోజులుగా హిమపాతం
  • బద్రీనాథ్ వద్ద రహదారి పనులు చేస్తున్న కార్మికులు
  • ఒక్కసారిగా విరిగిపడిన మంచు చరియలు
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేతం బద్రీనాథ్ వద్ద నేడు భారీ స్థాయిలో మంచు చరియలు విరిగిపడ్డాయి. మంచు కింద 55 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులు రహదారి పనులు చేస్తుండగా, ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. 

ఉత్తరాఖండ్ లో గత రెండ్రోజులుగా హిమపాతం నమోదవుతోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.


More Telugu News