తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ నిర్ణయం నిలువుటద్దమంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్

  • మామునూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా
  • త్వరితగతిన నిర్మాణాలు జరిగి ప్రజలకు సేవలందించాలంటూ రామ్మోహన్ ట్వీట్
  • రామ్మోహన్ నాయుడు ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఎయిర్ పోర్టు ఆపరేషన్స్‌కు కేంద్రమంత్రి ఉత్తర్వులు ఇచ్చారు. మామునూరు విమానాశ్రయం ఆపరేషన్స్‌కు అనుమతుల నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.

కాగా, దీనిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రీట్వీట్ చేశారు.

"ప్రాంతీయ అనుసంధానం, తెలంగాణ అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలిచేలా వరంగల్ (ముమునూరు) విమానాశ్రయానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ నిర్ణయం నిలువుటద్దంగా నిలవనుంది. త్వరితగతిన నిర్మాణాలు జరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను" అని రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


More Telugu News