నేను రాజీనామా చేసి, నా స్థానంలో మరొకరిని గెలిపించేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
- జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే
- రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి
- ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన
రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి, ఎవరినైనా గెలిపించేందుకు సిద్ధమని జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని, జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.
జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం రాజీనామా చేయమంటే చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదని ఆయన అన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదని అన్నారు. రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలని ఆయన అన్నారు.