టీమిండియా విన్నింగ్ మూమెంట్స్... ఇదిగో ఎమోష‌న‌ల్‌ వీడియో!

 
ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియాపై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించి ఫైన‌ల్‌కి దూసుకెళ్లిన‌ విష‌యం తెలిసిందే. దీంతో 2023 వన్డే ప్ర‌పంచ‌ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్ తో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక భార‌త జ‌ట్టు సాధించిన ఈ అద్భుత విజ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక చివ‌ర్లో భార‌త బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన సిక్స‌ర్‌తో మ్యాచ్‌ను ముగించిన సంగ‌తి తెలిసిందే. దాంతో మ్యాచ్ గెల‌వగానే భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సంబ‌రాల్లో మునిగిపోయారు. ఆ త‌ర్వాత మైదానంలోకి వ‌చ్చి సంద‌డి చేశారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ తాలూకు విన్నింగ్ మూమెంట్స్ కు సంబంధించిన‌ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఎమోష‌న‌ల్ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.


More Telugu News