నితీశ్ కుమార్ కూటమి మారతారు.. అవసరమైతే రాసిస్తా: ప్రశాంత్ కిశోర్
- ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన కూటమి మారతారన్న ప్రశాంత్ కిశోర్
- ఏ కూటమిలో ఉన్నా నితీశ్ కుమార్‌ను ప్రజలు అంగీకరించరని వ్యాఖ్య
- చెప్పింది జరగకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమి మారతారంటూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆయన కూటమి మారడం వంటి నిర్ణయాన్ని ఎంచుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ పోటీ చేస్తారని తెలిపారు. అయితే ఆయన కాకుండా మరెవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, కానీ ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన కూటమి మారే ప్రయత్నం చేయవచ్చని వ్యాఖ్యానించారు.
నితీశ్ ఏ కూటమిలో ఉన్నప్పటికీ ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు మాత్రం అంగీకరించరని ఆయన అన్నారు. కూటమి మార్పుపై తాను చెప్పింది జరగకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. అవసరమైతే తాను రాసిస్తానని వ్యాఖ్యానించారు.