కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీలకు మోదీ విషెస్... థాంక్స్ చెప్పిన చంద్రబాబు
- ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- రెండు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల జయకేతనం
- అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
- మీ నేతృత్వంలో మరెన్నో విజయాలు సాధిస్తామంటూ చంద్రబాబు రిప్లయ్
ఏపీలో ఎన్డీయే కూటమి తాజాగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
"విజయాలు అందుకున్న ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి. తద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళతాయి" అని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ట్వీట్ కు ఏపీ సీఎం చంద్రబాబు బదులిచ్చారు.
"ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఎన్డీయే కూటమి పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.